తిరువూరు కూటమిలో చిచ్చు.. జనసేన అభ్యర్థికి పోటీగా అభ్యర్థిని ప్రకటించిన ఎమ్మెల్యే కొలికపూడి..!
Advertisement
- పురపాలక ఎన్నికల్లో తిరువూరు చైర్మన్ సీటుపై ఎన్డీయే కూటమిలో రగడ
- పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి అసంతృప్తి
- జనసేన అభ్యర్థికి పోటీగా తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ప్రకటన
Advertisement
పురపాలక ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అధికార ఎన్డీయే కూటమిలో రాజకీయ ఉద్రిక్తత రాజుకుంది. తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి, ఆయన తిరుగుబాటు జెండా ఎగరేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన పార్టీ తమ అభ్యర్థిగా మాధవి పేరును ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వ్యతిరేకించారు. టీడీపీ తరఫున నాగలక్ష్మి శ్రావణిని ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నామంటూ ఆయన తన మద్దతు ప్రకటించారు.
రేపు శ్రావణి నామినేషన్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే కొలికిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ అనూహ్య పరిణామంతో తిరువూరులోని మిత్రపక్షాల మధ్య తీవ్ర గందరగోళం, అసంతృప్తి నెలకొంది. పొత్తు ధర్మానికి విరుద్ధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే రెబల్ అభ్యర్థిని నిలబెట్టడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.